కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన

by Mahesh |
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించేందుకు గాను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనుంది.. అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan).. కాకినాడ జిల్లాలో ఈ నెల 10న పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్రకారం.. ఆయన కాకినాడ(Kakinada), పిఠాపురం(Pitapuram) నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అధించిన తర్వాత డిప్యూటీ సీఎంగా అయిన పవన్ తిరిగి నియోజకవర్గానికి వస్తుండటంతో.. పిఠాపురం ప్రజలు కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed