‘రోలెక్స్’ పాత్రపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ కనెక్షన్ ఉందంటూ..

by Kavitha |   ( Updated:2024-10-18 08:45:00.0  )
‘రోలెక్స్’ పాత్రపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ కనెక్షన్ ఉందంటూ..
X

దిశ, సినిమా: కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా కనగరాజ్(Kanagaraj) తెరకెక్కించిన చిత్రం విక్రమ్(Vikram). 2022 లో విడుదలైన ఈ సినిమాలో సూర్య (Surya) ‘రోలెక్స్’ (Rolex) పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పాత్రకు ఎంత ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఏర్పడిందో మనకు తెలిసిందే. మాదక ద్రవ్యాల గ్యాంగ్ లీడర్‌గా సినిమా క్లైమాక్స్‌లో ఆయన పండించిన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రోలెక్స్ పాత్రను ఆధారంగా చేసుకొని పూర్తిస్థాయి సినిమాను తెరకెక్కిస్తానని లోకేష్(Lokesh) ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కంగువా(Kanguva) ప్రమోషన్లలో రోలెక్స్ మూవీ గురించి సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మాట్లాడుతూ.. ‘రోలెక్స్ సినిమాకి ఇది వరకే నేను చేసిన మరో సినిమాకు కనెక్షన్ ఉంది’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా అని ఎక్స్(X) వేదికగా పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కాగా సూర్య నటిస్తున్న కంగువా మూవీకు శివ(Shiva) దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్(Studio Green), యూవీ క్రియేషన్స్(UV Creations) సంయుక్తంగా నిర్మించాయి. ఇక దిశాపటానీ(Disha patani) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed