Sudheer Babu : కొడుకుతో కలిసి డబ్బింగ్ చెబుతున్న సుధీర్ బాబు

by Prasanna |   ( Updated:2024-10-11 14:49:04.0  )
Sudheer Babu : కొడుకుతో కలిసి డబ్బింగ్ చెబుతున్న సుధీర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ నేడు విడుదల కానుంది. తాజాగా, సుధీర్ బాబు తన కొడుకుతో ఉన్న వీడియోని ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

సుధీర్ బాబు పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. చరిత్ మానస్ మా నాన్న సూపర్ హీరో మూవీకి డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంది. నాన్న సెంటిమెంట్ మూవీ కాబట్టి ఇలా ఇద్దరూ ప్రమోట్ చేసారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత చరిత్ మానస్ ఈ మూవీలో యాక్ట్ చేసాడా లేక నిజంగానే డబ్బింగ్ చెప్పాడా అని ప్రశ్నలు వస్తున్నాయి

చరిత్ మానస్ అంతక ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. త్వరలోనే ఈ యంగ్ బాయ్ హీరోగా లాంచ్ అవుతాడని తెలిసిన సమాచారం. ఇప్పటికే, చరిత్ మానస్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చరిత్ ని చూసి అభిమానులు మేనమామ సూపర్ స్టార్ మహేష్ బాబు లాగే ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed