నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

by Disha News Desk |
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు తెలిపారు. గురువారం పట్టణ శివారులోని వి మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం (శ్రీ వైకుంఠపురం) ఆవరణలో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూజా కార్యక్రమం జరుగుతాయన్నారు. భక్తులు హిందూ బంధువులందరూ హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వీరేందర్ దేవేందర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed