- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sonia Gandhi: 'అగ్నిపథ్' దిశానిర్దేశం లేని పథకం
న్యూఢిల్లీ: Sonia Gandhi Responds Over Agnipath Protest| కరోనా సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ నియామక ప్రక్రియ దిశానిర్దేశం లేనిదని, యువత తమ నిరసనలు శాంతియుతంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సోనియా ప్రకటన విడుదల చేశారు. 'కాంగ్రెస్ యువతకు అండగా నిలుస్తుంది. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునేలా పోరాడుతూ.. యువత ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. నిజమైన దేశభక్తుడిలా.. మేము సత్యం, అహింస, శాంతి మార్గాన్ని అనుసరిస్తూ మీ గొంతును పెంచుతాము' అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యువత అభిప్రాయం తెలుసుకోకుండా కొత్త నియామక ప్రక్రియను ప్రకటించడం బాధ కలిగించిందని చెప్పారు. ఇది పూర్తిగా దిశానిర్దేశం లేనిదని అన్నారు. యువతతో పాటు అనేక మంది మాజీ అధికారులు, నిపుణులు కూడా ఈ పథకంపై ప్రశ్నలు లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ ప్రస్తుతం పోస్టు కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు యువత బాధను కేంద్రం అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. యువత డిమాండ్లకు తక్షణమే పరిష్కారం సూచించాలని కోరారు. కేంద్రం వారికి ప్రాధాన్యం ఇవ్వట్లేదని పేర్కొన్నారు.
- Tags
- Sonia Gandhi