- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనం కోసం పరితపించిన మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్ధన్‌రెడ్డి కన్నుమూత
దిశ ప్రతినిధి, వరంగల్ : సోషలిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్ధన్‌రెడ్డి(87) మరణం ఓరుగల్లు రాజకీయాల్లో విషాదం నెలకొంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పరిపాటి జనార్దన్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. జనార్ధన్‌రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జనార్ధన్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై, ప్రజా పోరాటాలకు ఆకర్షితులయ్యారు.
1972లో కమాలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనార్ధన్‌రెడ్డి సమీప అభ్యర్థి కే.వీ నారాయణరెడ్డిపై విజయం సాధించారు. అలాగే 1977లో హన్మకొండ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ నుంచి కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై పార్లమెంటరీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే తదనంతరం కాలంలో పీవీ చేతుల మీదుగానే పి.జనార్ధన్‌రెడ్డి అవార్డులు అందుకోవడం గమనార్హం.
పిన్న వయస్సులోనే రాజకీయాలకు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి చేసిన ఆయన 24 సంవత్సరాల వయస్సులో జమ్మికుంట నుంచి సమితి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినందుకు వ్యతిరేకంగా జై ప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని లోక్ సంఘర్ష్ సమితి లో చేరాడు. సంఘర్ష్ సమితి కార్యక్రమంలో కరీంనగర్‌లో ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడంలో ఆయన విజయవంతమయ్యారనే చెప్పాలి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టిన సమయంలో కొన్ని కఠిన చట్టాలను నాటి ప్రభుత్వం నమోదయ్యేలా చేసింది. దీంతో ముషీరాబాద్ జైలులో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు.
కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు..
జనార్దన్ రెడ్డి 1964-65 లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఆదర్శ డిగ్రీ కళాశాలను స్థాపించి ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు అప్పగించారు. అలాగే 1978లో కుష్టు వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం జమ్మికుంటలో ఆశ్రమ పాఠశాలను, శంభునిపల్లెకు సమీపంలో వాడను ఏర్పాటు చేయించగలిగారు. 1974లో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలలో తెలంగాణ గ్రామీణ ప్రజలకు సేవలందించడం గమనార్హం. 1992లో వ్యవసాయ మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థాగత ప్రాజెక్ట్ అయిన కృషి విజ్ఞాన కేంద్రంని కూడా స్థాపించి.. ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు.