- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌ఫ్లుయెన్సర్స్ డైట్ టిప్స్.. మంచి కన్నా చెడే ఎక్కువ
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా, ఎలాంటి ఫుడ్ ఐటెం ఆర్డర్ చేయాలన్నా ముందుగా సంబంధిత రివ్యూస్ చూడటం అలవాటైపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆహార సంబంధిత పోస్ట్‌లు ఎక్కువైపోయాయి. యూట్యూబ్ వీడియోల ద్వారా డైట్ టిప్స్ సూచిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు సంఖ్య కూడా పెరిగింది. వీళ్లెవరూ డైటీషియన్స్ కానప్పటికీ కేవలం ఫేమ్ కారణంగా జనాలు వారి సలహాలను పాటిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. నిజానికి వ్యక్తి శారీరక ధర్మాన్ని బట్టి, తాము తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అది పోషకాహార నిపుణులకే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల సలహాల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా హానికరం?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తమను తాము లేదా ఒక నిర్దిష్ట బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు వివిధ ఆహారాలపై తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తారని లైఫ్‌స్టైల్ కన్సల్టెంట్ డాక్టర్ పల్లవి వెల్లడించారు. ఈ ఆహారాల్లో చాలా వరకు శాస్త్రీయంగా సరైనవి కావని, జీవక్రియ అసమతుల్యతలకు దారితీసి చివరకు జీవనశైలి వ్యాధులు పరిణమిస్తాయని చెప్పింది. జ్యూసింగ్, క్లోరోఫిల్ వాటర్, ఫ్రూట్ డైట్ వంటి ఆహారాలు ఫుడ్ ఇంబ్యాలన్స్‌తో పాటు వినాశకర పరిణామాలు కలిగిస్తాయని తెలిపింది.
ఫాడ్ డైట్స్ ద్వారా ఎదుర్కొనే నష్టాలు:
* కండరాల నష్టం, ఆస్టియోపోరోసిస్(బోలు ఎముకల వ్యాధి)
* ఫ్యాటీ లివర్, మైగ్రేన్
* IBS(తాపజనక ప్రేగు వ్యాధి). ఇది పెద్ద ప్రేగులను ప్రభావితం చేసే ఒక సాధారణ రుగ్మత
* PCOD(పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి). అండాశయాలు అపరిపక్వ లేదా పాక్షిక పరిపక్వత గల అండాను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే వైద్య పరిస్థితి.
* హార్మోన్ అసమతుల్యత
* డిప్రెషన్, ఆందోళన
* ఎక్కువ కాలం పాటిస్తే మధుమేహం, రక్తపోటు
మానసిక ఆరోగ్యానికి అంతరాయం :
మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అంటే మానసిక ఆరోగ్యం 'తలనొప్పి, ఫైబ్రోమైయాల్జియా, IBS, కీళ్ల నొప్పులు, వెర్టిగో' తదితర శారీరక లక్షణాలను చూపిస్తుంది. కాగా శరీరానికి సరైన పోషకాహార ఆవశ్యకతను అనేక న్యూట్రిషనల్ సైకాలజీ పరిశోధనలు చూపిస్తున్నాయి. ఈ మేరకు ఇంట్లో విషపూరిత రసాయనాలు, సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్ అండ్ జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ఎందుకు ఫాలో అవుతారు?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తరచుగా తమ ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైనింగ్ కమ్యూనికేషన్ స్టైల్‌తో ప్రలోభపెడతారు. ఈ క్రమంలో వారు ఏదేని ఉత్పత్తి, వ్యాపారం లేదా ఆహారం కోసం ప్రచారం చేసినపుడు ఫాలోవర్స్‌లో చాలా మంది ఎలాంటి సంకోచం లేకుండా తమను గుడ్డిగా నమ్మేస్తారు. యాక్సెస్ సౌలభ్యంతో పాటు వారు ఆకర్షణీయంగా కనిపిస్తూ అనేక మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉండటం కూడా ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.