నాడు సమంత మెహందీ ఫంక్షన్‌లో మెరిసిన శోభిత ధూళిపాళ.. ఫొటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-10-23 07:12:39.0  )
నాడు సమంత మెహందీ ఫంక్షన్‌లో మెరిసిన శోభిత ధూళిపాళ.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ కొన్ని ఫొటోలు తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని అర్థం అయిపోయింది. ఈ క్రమంలో అప్పట్లో సమంత మెహందీ ఫంక్షన్‌లో శోభిత సందడి చేసింది అనే ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటి హీరోయిన్ సమంత మెహందీ ఫంక్షన్‌కు శోభిత వెళ్లిందా అని అనుకుంటున్నారా..? అయితే మీరు పొరబాటు పట్టడ్డే.. ఎందుకంటే ఈ బ్యూటీ సందడి చేసిన ఫంక్షన్ స్వయానా శోభిత సొంత చెల్లెలు సమంత మెహందీ ఫంక్షన్‌లో కాబట్టి. వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సిస్టర్ సమంత ధూళిపాళ అందరికీ తెలిసిందే. డాక్టర్ అయిన ఈమె తన అక్క శోభిత కంటే ముందుగా సాహిల్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లి 2022లో జరగ్గా.. తాజాగా సమంత ధూళిపాళ్ల సంగీత్ వేడుక ఫొటోలు, వీడియోలను మరోసారి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. అయితే శోభిత ఈ ఫంక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. కాగా నాగచైతన్య - శోభిత మ్యారేజ్ సమయంలో ఈ ఫొటోలు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

(video link credits to samantha dulipala instagram id)

Advertisement

Next Story