- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధోని బ్యాటింగ్‌పై.. శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓపెనర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)పై సులువుగా విజయం సాధించింది. అజింక్యా రహానే 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో KKR మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎంఎస్ ధోని క్రీజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ టెన్షన్‌గా ఉంటుందని మ్యాచ్ తర్వాత కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. స్కోర్‌ను 131 పరుగుల వరుక తీసుకెళ్లడం ద్వారా CSK పరువు కాపాడిన ధోనీ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధోని చేసిన 38 బంతుల్లో 50 పరుగులు తన టీం విజయానికి ఉపయోగపడక పోయిన.. CSK అభిమానులకు మాత్రం మంచి ట్రీట్ అయితే ఇచ్చాడని పేర్కొన్నాడు.
"ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ టెన్షన్‌గా ఉంటుంది. మరోవైపు చుట్టూ మంచు కురుస్తుండటంతో మ్యాచ్ ఇక వారి వైపుకు మారుతుందని నాకు అనిపించింది. ఆ సమయంలో బంతిని పట్టుకోవడం కష్టంగా ఉంది. అయితే టీం నుంచి కొత్త బాధ్యతలను ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడు. ప్లెయర్స్ అంతా బాగా సపోర్ట్ చేశారన.. ఈ విజయం మేము ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది" అని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు.