- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే..?
దిశ, అమరచింత: హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కమిషనర్, కౌన్సిలర్స్, కో అప్షన్ సభ్యులకు జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాష మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత ఫిబ్రవరి నెల 19వ తేదీన అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటించిన కలెక్టర్.. తెలంగాణకు హరితహారం లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం కనిపించడంతో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కార్యక్రమం బూడిదలో పోసిన పన్నీరైంది. వెయ్యిల సంఖ్యలో నాటిన మొక్కలు, కనీసం వందల్లో కూడా కనిపించడం లేదనే విమర్శలు లేకపోలేదు. హరితహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ జారీ చేసిన నోటీస్ కి 3 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నోటీసు జారీ అయిన వారిలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, వైస్ చైర్మన్ జీఎస్ గోపి, కౌన్సిలర్స్ ఎం.లక్ష్మీ, వెంకటేష్, మంగ లావణ్య, విజయ రాములు, సింధు, రాజ్ కుమార్, దేవర్ల మాధవి, పారుపల్లి ఉషారాణి, ఎం.రాజశేఖర్, కో అప్షన్ సభ్యులు షానవాజ్, రాజేందర్, పద్మ, షాహిన్ బేగం, కమిషనర్ రమేష్ లు ఉన్నారు.