Sreeleela: ‘పుష్ప-2’ కిస్సిక్ సాంగ్‌కు శ్రీలీల రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2024-11-13 14:41:48.0  )
Sreeleela: ‘పుష్ప-2’ కిస్సిక్ సాంగ్‌కు శ్రీలీల రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ధమాకా’ (Dhamaka)చిత్రంతో ఓవర్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో అందరూ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తుందని భావించారు. కానీ వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా అమ్మడు క్రేజ్ తగ్గిపోయింది. హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ నుంచి కూడా తొలగించడంతో కొన్ని రోజులు యాడ్స్ చేసింది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక సినిమాలకు దూరం అయి డాక్టర్ చదువుతుందని అంతా భావించారు. ఈ క్రమంలో.. శ్రీలీల ‘పుష్ప-2’(Pushpa-2) స్పెషల్ సాంగ్‌ ఆఫర్ అందుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల మేకర్స్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో భారీ అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘పుష్ప-2’ కిస్సిక్(kissick) సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్(Remuneration) తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందు కోసం ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ప్రజెంట్ ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతుండగ.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 5 నిమిషాలకే అంత డబ్బు తీసుకుంటుందా అని షాక్ అవుతున్నారు.

Read More..

గెట్ రెడీ ఫ్యాన్స్.. ‘పుష్ప-2’ ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్


Advertisement

Next Story