షాకింగ్ న్యూస్.. నాగచైతన్యకు సమంత లీగల్ నోటీసు..? టైం చూసి దెబ్బ కొట్టిందే అంటున్న నెటిజన్లు..!

by Kavitha |   ( Updated:2024-10-30 04:33:29.0  )
షాకింగ్ న్యూస్.. నాగచైతన్యకు సమంత లీగల్ నోటీసు..?  టైం చూసి దెబ్బ కొట్టిందే అంటున్న నెటిజన్లు..!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి(Marriage) కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. త్వరలో నాగచైతన్య- శోభిత పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామ్.. నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపిందనే వార్త నెట్టింట షికారు చేస్తోంది. గతంలో నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసి ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి తమ అభిరుచికి తగ్గట్టుగా దానిని డిజైన్ చేయించుకుని ఆ ఇంట్లోనే కాపురం పెట్టారట. అలా వారు విడిపోక ముందు వరకు ఆ ఇంట్లోనే ఉన్నారట. అయితే ఈ ప్లాట్‌ను కొన్న టైంలో నాగ చైతన్య కంటే ఎక్కువగా సమంత ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసిందట. ఆ ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేసి చైకి లీగల్ నోటీసు(Legalnotice)లు పంపిందని సమాచారం. దానికి కారణం శోభితతో మ్యారేజ్ అయిన తర్వాత నాగచైతన్య ఆ ఇంట్లోనే కాపురం ఉండనున్నాడనీ, అలాగే ఆ ప్లాట్‌ను శోభిత పేరు మీదనే రాసి ఇచ్చేయడానికి చై సిద్ధపడ్డాడని సమాచారం. ఈ క్రమంలోనే అంత ఖర్చు పెట్టి మరీ నాకు కూడా నచ్చినట్టు ఆ ఇల్లును డిజైన్ చేపిస్తే ఇప్పుడు ఆ శోభితకు రాసి ఇచ్చేస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను అంటూ సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు సమంత కరెక్ట్ టైం చూసి దెబ్బకొట్టిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిలో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా దీనిని 'దిశ' ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story