Pushpa2: బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! భారీగా పెంచనున్న ‘పుష్ప 2’ టికెట్ ధరలు..?

by Kavitha |   ( Updated:2024-11-19 15:58:11.0  )
Pushpa2: బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! భారీగా పెంచనున్న ‘పుష్ప 2’ టికెట్ ధరలు..?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా సినీ లవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజై భారీ హిట్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంపుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. టికెట్ల ధరలను పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం AP నగరాల్లో రూ.150- 200 ఉన్న టికెట్ రేటును రూ.300కు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు టాక్. దీనిపై గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.


Read More...

Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన ఆ నటుడు ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed