'మిస్‌ యూనివర్స్‌'ను అవమానించిన శిల్పాశెట్టి.. వీడియో వైరల్

by Mahesh |   ( Updated:2023-03-24 17:43:12.0  )
మిస్‌ యూనివర్స్‌ను అవమానించిన శిల్పాశెట్టి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : 2021 'మిస్‌ యూనివర్స్‌' కిరీటాన్ని భారతీయ యువతి హర్నాజ్‌ కౌర్ సంధు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు వరించి నప్పటి నుంచి అనేక వేడుకల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్న హర్నాజ్.. తాజాగా మోస్ట్‌ పాపులర్‌ బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్‌ టాలెంట్‌ 9'కు గెస్ట్‌‌గా హాజరైంది. అయితే ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి, బాద్‌షా, మనోజ్ ముంతాషిర్‌, కిరణ్‌ ఖేర్‌ జడ్జిలతో ఇంటరాక్షన్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వారిని పలకరించేందుకు హర్నాజ్ స్టేజ్‌పైకి వచ్చినప్పుడు శిల్పాశెట్టి తనను పట్టించుకోకుండా ముఖంచాటేయడం హాట్ టాపిక్‌గా మారింది.

హర్నాజ్ మిగతా జడ్జిలను పలకరిస్తుంటే ఆమె మాత్రం తన చెల్లెలు షమితా శెట్టి తో మాట్లాడుతూ కనిపించింది. అయితే చివరలో హర్నాజ్‌ను పలకరించిన శిల్ప.. ఇక తప్పదు అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు శిల్ప తీరుపై ఫైర్ అవుతున్నారు. న్యాయనిర్ణేతలుగా కుర్చీలో కూర్చున్న వారికి అతిథులుగా గౌరవించే సంస్కారం కూడా లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed