Sharad Pawar: బీజేపీతో ఎన్‌సీపీ పొత్తుపై క్లారిటీ.. వచ్చే ఎన్నికల్లో వారిదే అధికారమన్న శరద్ పవార్

by Javid Pasha |   ( Updated:2022-04-06 14:55:26.0  )
Sharad Pawar: బీజేపీతో ఎన్‌సీపీ పొత్తుపై క్లారిటీ.. వచ్చే ఎన్నికల్లో వారిదే అధికారమన్న శరద్ పవార్
X

దిశ, వెబ్‌డెస్క్: మహరాష్ట్ర రాజకీయాల్లో గతకొన్నాళ్లుగా బీజేపీ, ఎన్‌సీపీ పొత్తు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ రెండు పార్టీలు పొత్తుకు ఓకే అన్నాయని, వచ్చే ఎన్నికల్లో పొత్తును బహిర్గతం చేయనున్నాయని వార్తలు అనేకం వచ్చాయి. అయితే తాజాగా వీటిపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. బీజేపీ పొత్తుకు ఆస్కారమే లేదని, అటువంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. అయితే కేంద్ర విచారణ ఏజెన్సీల దుర్వినియోగం గురించి మాట్లాడిన పవార్.. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం బలంగా, స్థిరంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంవీఏనే అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎన్సీపీ వైపు నుంచి ఎంవీఏ కేబినెట్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed