షాకింగ్ లుక్‌లో రణబీర్.. లీకైన 'షంషేరా' పోస్టర్

by Sathputhe Rajesh |
షాకింగ్ లుక్‌లో రణబీర్.. లీకైన షంషేరా పోస్టర్
X

దిశ, సినిమా : రాబోయే నెలల్లో రణబీర్ కపూర్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి 'బ్రహ్మాస్త్ర' కాగా మరొకటి 'షంషేరా'. బ్రహ్మాస్త్ర మూవీ గురించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వెలువడగా.. 'షంషేరా' జూలై 22న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. రీసెంట్‌గా రిలీజైన రణబీర్ ఫస్ట్ ఫుల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పిక్‌లో పొడవాటి జుట్టు, గడ్డంతో గుర్తపట్టని విధంగా కనిపించిన రణబీర్.. అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే ఈ పిక్‌పై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.


Advertisement

Next Story