Shahid kapoor: ఆయన డైరెక్షన్ చేయకపోవడమే బెటర్.. తండ్రిపై స్టార్ హీరో కామెంట్స్

by Manoj |   ( Updated:2022-04-05 08:25:01.0  )
Shahid kapoor: ఆయన డైరెక్షన్ చేయకపోవడమే బెటర్.. తండ్రిపై స్టార్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన అప్‌కమింగ్ మూవీ 'జెర్సీ' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుండగా తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తండ్రి పంకజ్ కపూర్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడంపై ఓపెన్ అయ్యాడు. సాధారణంగా తండ్రీకొడుకులు కలిసి నటించే ప్రతీ సీన్ ఎవరికైనా ఎగ్జైటింగ్‌ అండ్ ఎమోషనల్‌గా ఉంటుందన్న హీరో.. తనకు మాత్రం మాటల్లోని చెప్పలేని అనుభూతి కలిగిందని తెలిపాడు.

ఎంతో అనుభమున్న ఆయనతో నటించేటపుడు కొన్నిసార్లు కెమెరా ముందు ఆందోళనకు గురయ్యానన్న షాహిద్.. ఎంతకాదన్నా నిజజీవితంలో ఉండే రియాలిటీ రీల్ లైఫ్‌లో కనిపించదని చెప్పాడు. ఇక తన తండ్రి దర్శకుడిగా ఉండటం కన్నా నటుడిగా ఉంటేనే రిలాక్స్‌గా ఉంటుందన్న కబీర్ సింగ్ హీరో.. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌తో యాక్ట్ చేసేటప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటామని, వాళ్లు అందించే శక్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని వివరించాడు.


Advertisement

Next Story

Most Viewed