- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్యాయాలను చూడలేకపోతున్నాం.. సీఎం జగన్‌పై టాలీవుడ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: మూడేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం తిరుపతిని సర్వనాసనం చేసింది. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ఇప్పుడక్కడ జరగని పాపం లేదని సినీ నిర్మాత అశ్వినీ దత్ తీవ్ర విమర్శలు చేశారు. 'సీతా రామం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో తిరుపతిని సర్వనాశనం చేసింది. స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నారో అర్థం కావడంలేదు అంటూ అందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతుంటే చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? చినజీయర్ ఆ మధ్య ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగిడారు. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉంది. వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చినజీయర్ స్వామి చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. కానీ, ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.