1వ తరగతి సీటు కోసం లక్కీడిప్.. ఆ స్కూల్‌కు భారీ డిమాండ్..!

by Satheesh |   ( Updated:2022-03-15 14:26:43.0  )
1వ తరగతి సీటు కోసం లక్కీడిప్.. ఆ స్కూల్‌కు భారీ డిమాండ్..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: హైదరాబాద్, రామంతాపూర్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఒక సీటు కోసం మేడ్చల్ జిల్లాలోని ఎస్సీ బాలబాలికల నుంచి వచ్చిన దరఖాస్తులలో లక్కీడిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. జిల్లా నుంచి బేగంపేట పాఠశాలకు 18 దరఖాస్తులు, రామంతాపూర్ పాఠశాలకు 15 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్కీడిప్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా.. బేగంపేట పాఠశాలలో టోనీ బ్లెయిర్, రామంతాపూర్ పాఠశాలలో సద్విత్ కిరణ్‌ లక్కీడిప్ ద్వారా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story