- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బార్డర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. పక్కా స్కెచ్ వేసిన పోలీసులు..
దిశ, జహీరాబాద్: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో 190 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఇద్దరు నిందితులు బాబా పటేల్ (25), మహమ్మద్ సయ్యద్ (55) లపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నమ్మదగిన సమాచారం మేరకు జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజ్, సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో సోమవారం చిరాక్ పల్లి ఎస్ఐ కాశీనాథ్ తన సిబ్బందితో కలిసి మాడ్గి శివారులోని ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 8గంటల సమయంలో జహీరాబాద్ వైపునుండి కర్ణాటక వైపు వెళ్తున్న లారీ అనుమానాస్పదంగా ఉండటంతో దానిని ఆపి తనిఖీ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని దొంగచాటుగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ బీదర్ జిల్లాకు చెందిన బాబా పటేల్ (25), లారీ యజమాని మహమ్మద్ సయ్యద్ (55)లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.