- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పిగ్ ట్రాన్స్‌లేటర్'లో పందుల ఎమోషన్స్
దిశ, ఫీచర్స్ : మనుషుల ఎమోషన్స్ మాటల ద్వారా బయటపడుతుంటాయి. కానీ పందుల భావోద్వేగాలు తెలుసుకోవడమెలా?.. వాటి మధ్య తగాదాలు, కొట్టుకోవడం, వధశాలలో పిగ్ చనిపోయే ముందు ఎలాంటి ఎమోషన్స్ కలిగి ఉంటాయో తెలిపేందుకు.. అంతర్జాతీయ పరిశోధకుల బృందం అల్గారిథం డెవలప్ చేసింది. వాటి అరుపులు, గుసగుసల శబ్దాల నుంచి వాటి ఎమోషన్స్‌ను క్యాచ్ చేస్తున్నారు. ఇందుకోసం AI సాయంతో ట్రాన్స్‌లేటర్ తయారుచేసిన వారు.. పందుల శ్రేయస్సుకు ఇది ముఖ్యమని చెబుతున్నారు.
అధిక పౌనఃపున్య ధ్వనులైన స్క్వీల్స్, అరుపులు ప్రతికూల భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉండగా, తక్కువ-ఫ్రీక్వెన్సీతో కూడా గుసగుసలు సానుకూల లేదా తటస్థ భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాయని గత అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవే కాకుండా దేశీ పందులు స్వర వ్యక్తీకరణను రకరకాలుగా ప్రదర్శిస్తాయి. ఈ మేరకు వీటి స్వరాలను అర్థం చేసుకునేందుకు 411 పందుల నుంచి సేకరించిన 7,414 వేర్వేరు శబ్దాలను AI పిగ్ ట్రాన్స్‌లేటర్ సాయంతో తాజా అధ్యయనంలో జాబితా చేశారు. ఈ క్రమంలోనే ప్రతి పంది శబ్దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్, ఆ సమయంలో దాని ప్రవర్తన ఎలా ఉందని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సంతోషం లేదా ఉత్సాహం వంటి సానుకూల భావోద్వేగాలను లేదా భయం, బాధ వంటి ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నాయో లేదో అర్థం చేసుకున్నారు. వరాహాల ఓయింక్స్, స్నఫ్ల్స్, గుసగుసలు, కీచులాటలను భావోద్వేగాలుగా మార్చే AI పిగ్ ట్రాన్స్‌లేటర్ వల్ల జంతువుల శ్రేయస్సును ఆటోమేటిక్‌గా పర్యవేక్షించవచ్చని..ఇది పొలాలు, ఇతర ప్రాంతాల్లో పందుల చికిత్సకు మార్గం సుగమం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సానుకూల లేదా ప్రతికూల భావోద్వేగాలకు సంబంధించిన 92% కాల్స్‌ను స్పష్టంగా కచ్చితత్వంతో వర్గీకరించినట్లు వెల్లడించారు.