- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..!
దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనది. ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు మెంబర్షిప్ ప్రక్రియ కొనసాగనున్నది. ఆ తర్వాత తెలంగాణాలో 5 జోన్లుగా ప్రకటించి, ఎన్నికలు నిర్వహించనున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేన రెడ్డి పదవీకాలం ముగియడంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ సురభి ద్వివేది, సాట్ చైర్మన్ శివ సేనారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డిలు షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కష్టపడి పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దింపడానికి యూత్ కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. గత ప్రభుత్వం నాలుగు వందల మంది యువజన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందన్నారు. ఇప్పుడు వాళ్లంతా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ మూడేండ్లలో చాలా మంది తమ కుటుంబాలని వదిలి యువజన కాంగ్రెస్ కోసం కష్ట పడ్డారన్నారు. కష్టపడ్డవారిని అందరిని గుర్తు పెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కారణమన్నారు. యువకుడుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా యువజన కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.