టీఆర్ఎస్‌కు రేగుల సంతోష్ బాబు వార్నింగ్.. చర్యకు ప్రతి చర్య తప్పదంటూ..

by Satheesh |
టీఆర్ఎస్‌కు రేగుల సంతోష్ బాబు వార్నింగ్.. చర్యకు ప్రతి చర్య తప్పదంటూ..
X

దిశ, వేములవాడ: ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై.. టీఆర్ఎస్ గూండాలు దాడిచేయడం హేయమైన చర్యని బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అన్నారు. దీనితో వేములవాడ బీజేపీ కార్యాలయంలో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలుచేస్తే ప్రశ్నించే బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ దాడులను ప్రోత్సహిస్తుందన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాడులను ప్రోత్సహిస్తూ.. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు కేవలం బీజేపీ నాయకులనే రిమాండ్‌కు పంపించడం బాధాకరం అన్నారు. ఈ దాడులతో బీజేపీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని.. చర్యకు ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అధికార ప్రతినిథి ముప్పిడి శ్రీనివాస్, గొడిశెల శ్రీనివాస్, నందిపేట సుదర్శన్ యాదవ్, అన్నారం శ్రీనివాస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story