- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా వీధుల్లో 'ఫ్లైయింగ్ కార్'!
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన శాంసన్ కంపెనీ నుంచి 'స్విచ్ బ్లేడ్' అనే ఫ్లైయింగ్ కారు రాబోతుంది. దాదాపు 14ఏళ్ల ప్రయోగం తర్వాత ఎఫ్‌ఏఏ(FAA) ద్వారా ఆమోదం పొందిన కారు.. ఇప్పుడు విమాన పరీక్షలకు సిద్ధమవుతోంది. జస్ట్ ఒకే ఒక్క బటన్ క్లిక్‌తో 200-mph (322-km/h) వేగంతో గాల్లో చక్కర్లు కొట్టే ఈ ఫ్లైయింగ్ కారు విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.
భూమిపై కారులా నడిచే 'స్విచ్ బ్లేడ్' కేవలం పుష్-బటన్ నొక్కిన మూడు నిమిషాల్లోనే ఆకాశంలో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మారిపోతోంది. 3-సిలిండర్లు సహా 1.6-లీటర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌పై ఇది నడుస్తుంది. అంతేకాదు ఈ వెహికల్ డ్రైవ్ మోడ్‌లో విద్యుత్ చక్రాలకు శక్తినిస్తుంది, ఎగిరే సమయంలో ఎలక్ట్రిక్ ప్రాప్ మోటారుగా ఉపయోగించబడుతుంది. 125 mph (201 km/h) వేగంతో ప్రయాణించే ఈ కారు ప్రామాణిక క్రూయిజ్ వేగం 160 mph (257 km/h)గా శాంసన్ పేర్కొంది.
ఇందులో 36-gal (125-L) ఇంధనాన్ని ఫిల్ చేస్తే, దాదాపు 450 మైళ్ల (724 km)వరకు ప్రయాణించొచ్చు. టేకాఫ్ కోసం 1,100-ft (335-m) రన్‌వే, ల్యాండింగ్ కోసం 700 ft (213 m) అవసరమవుతుంది. 14ఏళ్లుగా శాంసన్ ఈ వెహికల్‌పై పనిచేస్తుండగా ఎట్టకేలకు ప్రోటోటైప్‌ను పరిశీలించిన ఎఫ్‌ఏఏ ప్రయోగాత్మక విమానంగా నమోదు చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో ఫ్లైయింగ్ టెస్ట్ చేసేందుకు బృందం సన్నాహాలు ప్రారంభించింది.