- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన మ్యారేజ్ లైఫ్‌పై ఓపెన్ అయిన సమంత.. కేజీఎఫ్ అంటూ సెటైర్స్ ?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కరణ్ విత్ కాఫీ షోలో పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక చాలా మంది ఈ షో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా సమంతను ఇంటర్వూ చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది.
సమంత, చైతూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అని ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఏదైనా ఇంటర్వూలో సామ్ లేదా చై వివరణ ఇస్తారేమో అనుకున్న తమ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇద్దరూ ఏ ఇంటర్వూలోనైనా విడాకుల గురించిన టాపిక్ తీయలేదు. అయితే కరణ్ విత్ కాఫీ షోలో సమంత విడాకుల ఇష్యూపై ఓపెన్ అవుతుందని చాలా మంది ఎదురు చూశారు.
అయితే ఇందులో సామ్ తన విడాకు గురించి కొన్ని విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కరణ్ వేసిన ప్రశ్నలు ఈ అమ్మడు చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇక కరణ్ సమంతను ప్రశ్నలు అడిగే క్రమంలో నీ భర్త.. అనగానే.. సమంత .. భర్త కాదు.. మాజీ భర్త అంటూ.. కరణ్‌కే షాక్ ఇచ్చింది. దీంతో షాక్ అయిన కరణ్ మాజీ భర్త అంటూ ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. చైతూ పేరు తీయకుండా, తనపర్సనల్ విషయాలు రిలీవ్ చేయకుండా సామ్ చాలా తెలివిగా ఆన్సర్స్ ఇచ్చింది. ఇక మ్యారేజ్ లైఫ్ అనేది కేజీఎఫ్‌లా ఉంటదంటూ చెప్పుకొచ్చారు. దీంతో సమంత తన చైతూతో తన మ్యారేజ్ లైఫ్ గురించే ఓపెన్ అయ్యిందని కొందరు ముచచటిస్తున్నారు.
ప్రేమ పెళ్లి చేసుకున్న మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారని అడగగా, దానికి తెలివిగా సమాధానం ఇచ్చిన సామ్ ఇవన్నీ తర్వాత మాట్లాడు కుందాం అంటూ చెప్పేసింది. ఇక విడాకుల సమయంలో తాను చాలా బాధ పడ్డాను అని తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయాను.. ఓ కొటేషన్ చదవడం వలన తాను మళ్లీ మాములుగా అయిపోయినట్లు తెలిపింది. ఊ.. అంటావా అనే ఐటం సాంగ్ ఎందుకు చేశావని అడుగగా, ఊ అంటావా ఐటం సాంగ్‌లో లిరిక్స్ తనకు బాగా నచ్చయని చెప్పింది సమంత. ముఖ్యంగా మగవాళ్లపై సెటైరికల్‌గా ఆ పాట ఉందని.. అందుకే నచ్చి చేశానని చెప్పుకొచ్చింది.