- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్నిప్రమాదం.. ఐదేళ్ల బాలుడిని ప్రాణాలతో కాపాడిన స్థానికులు
దిశ, ముషీరాబాద్: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతిలాల్ నెహ్రూ నగర్ లో ఓ ఇంట్లో మంగళవారం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఇంట్లో ఉన్న ఐదు సంవత్సరాల బాలుడిని స్థానికులు కాపాడారు. మోతిలాల్ నెహ్రూ నగర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో తాళం వేసిన ఇంట్లో అంటుకున్న మంటలు ఎక్కడ విస్తరిస్తాయోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ముషీరాబాద్ ఫైర్ స్టేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి అగ్నిమాపక అధికారి యుగంధర్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సునీత, మోజెస్ భార్యాభర్తలు. మోతిలాల్ నెహ్రూ నగర్ లో గత 18 సంవత్సరాలుగా నివసిస్తున్నారు.
వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం సునీత భర్త మోజెస్ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి సునీత తన కూతురు కొడుకుతో ఉంటుంది. మధ్యాహ్నం పాఠశాల నుంచి కొడుకుని తీసుకువచ్చిన సునీత మూడు గంటల ప్రాంతంలో అతన్ని ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి కూతురు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లో వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. తాళం వేసిన ఇంట్లో మంటలంటుకుని పొగలు రావడం గమనించిన స్థానిక యువకులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న సునీత కొడుకు (5)ను ప్రాణాలతో కాపాడారు. అగ్ని ప్రమాదం సంభవించింది అన్న సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, మూడు తులాల బంగారం, ఫర్నిచర్ కాలి బూడిద అయ్యాయి. తాళం వేసి ఉన్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, అగ్ని ప్రమాదంలో మూడు నుంచి నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి యుగేందర్ ప్రసాద్ తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించగానే సకాలంలో స్పందించిన స్థానికులు ఇంటి తాళాలు పగులగొట్టి బాలుడిని కాపాడడతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.