- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flies : హంతకుడిని పట్టించిన ఈగలు.. వీడిన మర్డర్ కేసు మిస్టరీ
దిశ, నేషనల్ బ్యూరో : దుస్తులను ముసురుకున్న ఈగలు(Flies).. ఓ హంతకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాయి. దీంతో కొరకరాని కొయ్యగా మారిన మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 26 ఏళ్ల మనోజ్ ఠాకూర్ అక్టోబరు 30న ఉదయం పని కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. ఛర్‌గవాన్ ఏరియాలో ఉండగా.. అతడిని సమీప బంధువు 19 ఏళ్ల ధరమ్ ఠాకూర్ కలిశాడు. ఇద్దరూ కలిసి పార్టీ చేసుకోవాలని డిసైడయ్యారు. ఇందుకోసం ఛర్‌గవాన్ ఏరియాలోనే చికెన్, మద్యం కొన్నారు. అనంతరం దేవ్రీ తాప్రియా గ్రామ శివార్లలోని పొలాల్లోకి వెళ్లి కూర్చొని చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారు. మద్యం తాగారు. ఈక్రమంలో వాటి కొనుగోలుకు ఖర్చయిన డబ్బుల గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ధరమ్ ఠాకూర్ పొలంలో ఉన్న ఓ పదునైన పరికరంతో మనోజ్ ఠాకూర్‌ను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
అక్టోబరు 31న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చాక.. గ్రామస్తులందరితో కలిసి వెళ్లి మనోజ్ డెడ్ బాడీని ధరమ్ మళ్లీ చూశాడు. మనోజ్ ఠాకూర్ చివరిసారి వెళ్లిన ఛర్‌గవాన్ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. అతడి వెంట ధరమ్ ఠాకూర్ ఉండటాన్ని గుర్తించారు. ధరమ్‌ను అదుపులోకి తీసుకొని విచారించే క్రమంలో.. అతడి దుస్తులను ఈగలు ముసురుకొని ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా.. దుస్తులపై ఉన్న రక్తపు మరకల శాంపిల్స్, హత్యకు గురైన వ్యక్తి బ్లడ్ శాంపిల్స్ సరిపోలాయి. దీంతో మర్డర్ చేసింది ధరమ్ ఠాకూరే అని తేలిపోయింది.