Home Minister:లోన్ యాప్‌ల భరతం పడతాం.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!

by Jakkula Mamatha |
Home Minister:లోన్ యాప్‌ల భరతం పడతాం.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ,వెబ్‌డెస్క్: లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ రోజు(గురువారం) జరిగిన అసెంబ్లీ సమావేశంలో(Assembly Meetings) హోంమంత్రి అనిత(Home Minister Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. లోన్ యాప్‌ల(Loan App) వల్ల ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. లోన్ యాప్‌ల ప్రకటనలకు ఎవరూ ఆకర్షితులు కావద్దని ఆమె సూచించారు. ఈ మధ్య లోన్ యాప్ కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వార్తల్లో చూస్తునే ఉన్నాం అన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం(AP Government) లోన్ యాప్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే 199 మంది లోన్ యాప్ నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు. ‘‘తల్లిదండ్రులను పాకెట్ మనీ అడగలేని విద్యార్థులు కొందరు లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. వారు రీ పేమెంట్ కోసం స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఈ యాప్‌ల అరాచకాల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు’’ అని ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. ఈ క్రమంలో లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

Advertisement

Next Story