Accused were Arrested: రైళ్లలో చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. రూ.21 లక్షల ఆభరణాలు స్వాధీనం

by Shiva |
Accused were Arrested: రైళ్లలో చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. రూ.21 లక్షల ఆభరణాలు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా (Interstate Gang) గుట్టు రట్టైంది. కొన్నాళ్ల నుంచి రైళ్లలో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని హర్యానా (Haryana) రాష్ట్రానికి చెందిన ఓ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (Secunderabad Railway Police) పక్కా పథకం ప్రకారం.. మాటు వేసి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి రూ.21 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story