వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలి

by Naveena |
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలి
X

దిశ ,సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆధ్వర్యంలో గురువారం నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ రోజు దీక్షను జాతీయ కమిటీ సభ్యులు కర్ల విజయరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చింత సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి జీవో నెంబర్ 33ను అమలు చేయాలన్నారు. వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని అన్నారు. నాల్గవ రోజు దీక్షలో కోదాడ నియోజకవర్గం నుంచి 50 మంది వికలాంగులు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నయీం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కులపోరాట సమితి రాష్ట్ర నాయకులు పులి నాగేశ్వరరావు,వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జహీర్ బాబా, జిల్లా ఉపాధ్యక్షులు చింత సాంబయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యా తాకుల ఎల్లయ్య మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు బుల్లికొండ వెంకన్న, నాయకులు దున్నపోతుల కార్తీక్, ములకలపల్లి సైదులు, షేక్ సొందు, యాతం వీరస్వామి, రాయిల అరుణ, కుంటి గొర్ల గోపి యాదవ్, కొండా వీరస్వామి గౌడ్, తోకల చంద్రయ్య, కంచర్ల నారాయణమ్మ, డోగుపర్తి రమణ, ఆంగోతు షవల్, పులి రోశయ్య, తుపాకుల నాగేశ్వరరావు, పాల కుర్తి నాగరాజు, ముడియాల శ్రీనివాస్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story