- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Disha effect : దిశ ఎఫెక్ట్...భూమి కబ్జాపై కదిలిన యంత్రాంగం

X
దిశ, తంగళ్లపల్లి : రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బావి తవ్విన విషయమై ప్రజావాణిలో రైతు చేసిన ఫిర్యాదుకు అధికార యంత్రాంగం కదిలింది. మంగళవారం దిశలో ప్రచురితమైన తాడూరులో ప్రభుత్వ భూమి కబ్జా అనే కథనానికి అధికారులు స్పందించి భూమిని కబ్జా చేసి తవ్విన బావిని పరిశీలించారు.
కోడి అంతయ్య అనే వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో సండ్రవాగులో భూమిని కబ్జా చేసినట్లు రాజిరెడ్డి అనే రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు వాగు శివారులో తవ్విన బావిని పరిశీలించారు. అక్రమంగా కబ్జా చేసి బావిని తవ్వించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ దినేష్, మండల ఇరిగేషన్ అధికారి సాగర్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరాజం తెలిపారు.
Next Story