- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PM Narendra Modi: ప్రధాని హోదాలో చీప్‌గా మాట్లాడొద్దు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత దిగజారుస్తున్నారని, మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Jharkhand Assembly Elections) బీజేపీ ఓడిపోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. ప్రధాని మోడీ సీ గ్రేడ్ హిందీ సినిమాలో విలన్ మాట్లాడే భాషను ఉపయోగించడం సరికాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి పదవి మర్యాదను ఆయన కాపాడాలని వివరించారు. అదే సందర్భంలో ప్రధాని మోడీ ఆయన మంత్రులను విమర్శిస్తున్నారా? అని కూడా ఎదురుదాడి చేశారు.
‘లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ప్రజలను విభజించడానికి విషం కక్కారని, దున్న, మటన్, చేపలు, మంగళసూత్రం, ముస్లింలు మొదలు అనేక వివాదాస్పద విషయాలను ప్రధాని ప్రస్తావించారు. ఇక జార్ఖండ్ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా ఆడబిడ్డలు, తినే భోజనం కూడా లాక్కుంటారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అప్పుడు మంగళసూత్రం గురించి ప్రచారం చేసినా ఓట్లు పొందక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు మరీ దిగజారి మాట్లాడుతున్నారని, ఓడిపోతామనే భయం వారికి ఉన్నట్టు ఈ వ్యాఖ్యలే వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వం చొరబాటుదారులదని, వారంతా జార్ఖండ్ ప్రజల ఆడబిడ్డలను, తినే ఆహారాన్ని లాక్కుంటారని ప్రధాని మోడీ కామెంట్ చేశారు.