- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Marijuana : గంజాయి అలవాటు చేస్తూ...వారికి విక్రయిస్తూ...

దిశ, బుగ్గారం : గంజాయి అలవాటు చేస్తూ వారికి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుగ్గారం మండలంలోని వెలుగొండ క్రాస్ రోడ్ వద్ద వెలుగొండ గ్రామానికి చెందిన గుజ్జేటి వంశీ, ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్ అనే యువకులు గంజాయి తరలిస్తుండగా ఎస్సై శ్రీధర్ రెడ్డి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకెళ్తే... వెలుగొండ గ్రామానికి చెందిన గుజ్జేటి వంశీ అనే యువకుడు గత కొన్ని నెలల నుంచి గంజాయికి బానిసై అతని స్నేహితులకు కూడా అలవాటు చేసేవాడు. వారికి కావాల్సిన గంజాయిని అమ్మేవాడు. ఈ క్రమంలో ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్ అనే యువకుడితో పరిచయం ఏర్పరచుకొని ఇద్దరూ కలిసి గంజాయి వినియోగం మొదలుపెట్టారు. జల్సాల కోసం డబ్బు అవసరం కావడంతో ఇతరులకు గంజాయి అమ్మేవారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.