- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector Pratik Jain : రేపటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
దిశ, ప్రతినిధి వికారాబాద్ : నేడు (బుధవారం) నుండి జరిగే సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల స్పెషల్ అధికారులు, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్ లతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడుతూ సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. సామాజిక, ఆర్థిక ,విద్య, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎన్యుమరేటర్లు మున్సిపల్, గ్రామస్థాయిలో వార్డు నుంచి మొదలుకొని కేటాయించిన బ్లాక్ స్థాయి వరకు పూర్తిస్థాయిలో సమాచార సేకరణ నమోదును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సర్వే నిర్వహణలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అలాగే సర్వే నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అదికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే రేపటి నుండి మొదలవుతుందని, అధికారులు సర్వే కోసం ఎమ్యూనేటర్లు, హౌస్ లిస్టింగ్, మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. ప్రతి తహసీల్దార్, ఎంపిడిఓ ల దగ్గర గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నివాస స్థలాల మ్యాప్‌లు, హౌస్ లిస్టింగ్ ఫార్మాట్, 57 ప్రశ్నల ఫార్మాట్, సర్వే పూర్తి అయిన ఇంటిపై అతికించే స్టిక్కర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ సర్వే అన్ని ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని, ఎటువంటి తప్పులు లేకుండా, జాగ్రతగా సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి..
రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఖరీఫ్ ధాన్యం సేకరణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ సంవత్సరం కొత్తగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నదని తెలిపారు. జిల్లాలో సుమారు ఒక లక్షా ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 126 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లైట్స్, ఫ్యాన్స్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డిఎ శ్రీనివాస్, సీపీఓ అశోక్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీఓ లు పాల్గొన్నారు.