- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: కీలక నిర్ణయం తీసుకున్న సమంత.. ఇక నుంచి వాటికి దూరంగా ఉంటానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఏడాది తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి అలరిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘ప్రేక్షకులు అన్ని విషయాలను గమనిస్తారు.
అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే నేను పాత్రలను ఎంచుకునే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచించి ఎంపిక చేసుకుంటాను. ప్రజెంట్ సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. సినిమాల్లో కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటా.
అలాగే నేను చేసే యాడ్స్ విషయంలోనూ ఆలోచించి చేస్తాను. ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) లో నటించడం నాకు సవాలుగా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర యాక్షన్ సీన్స్(Action Scenes)లోనూ హీరోతో సమానంగా చేశాను. కానీ ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి వాటి కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కొన్నింటినే ఎంచుకున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు నేను చేసిన సినిమాలకు మధ్య చాలా తేడా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.
Read More ...
Samantha: పదేపదే ఫోన్ కాల్.. సమంత నెంబర్ బ్లాక్ చేసి పడేసిన నాగ చైతన్య.. దుమారం రేపుతున్న న్యూస్..?