- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: తన రెండో పెళ్లి పై సంచలన కామెంట్స్ చేసిన సమంత.. నెట్టింట వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి(Marriage) కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో ఎంగేజ్‌మెంట్(Engagment) చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది.
కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man 2) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj & DK) రూపొందిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ భారీ అంచనాల నడుమ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన సెకెండ్ మ్యారేజ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.."నేను ప్రేమించి, ఇష్టపడి వివాహం చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాము. జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించట్లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు" అని సమంత సృష్టంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. సామ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.