Samantha: షాకింగ్ న్యూస్.. రెండో పెళ్లికి రెడీ అయిన సమంత

by samatah |   ( Updated:2022-04-22 06:27:31.0  )
Samantha: షాకింగ్ న్యూస్.. రెండో పెళ్లికి రెడీ అయిన సమంత
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో లవ్‌లీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది సమంత(Samantha), నాగచైతన్యనే(Naga Chaitanya). ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత తన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరు మళ్లీ కలవాలని పూజలు చేసినవారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వీరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ సామ్, చై తమ కెరీయర్‌పై ఫొకస్ చేసినట్లు తెలుస్తుంది. కాగా, సమంతపై మరో రూమర్ తెరపైకి వచ్చింది. సమంత తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిందంట. గత కొద్ది రోజుల నుంచి సామ్‌ని తన ఇంట్లో వారు పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. తన తల్లిదండ్రుల బాధ చూడలేక సమంత రెండో పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కానీ పెళ్లి చేసుకోవడానికి కాస్త సమయం కావాలని, ప్రస్తుతం అప్సెట్‌లో ఉన్నాను.. ఇప్పుడు మొత్తం కెరియర్‌పైనే దృష్టిపెడుతానని తన ఇంట్లో వాళ్లను కోరడంతో వారు కూడా సంతోషంగా సమంతకు సపోర్టు ఇచ్చారంట. అలాగే తన వ్యక్తిగత జీవితంతో పాటు తన కెరీర్‌కి గౌరవం ఇచ్చి తనని అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని సమంత చెప్పినట్లు సమాచారం. ఇక ఈ వార్త రూమర్‌నా లేక సమంత నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed