- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుల్ టెన్షల్‌లో సమంత.. వీడియో చూసి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. అలా ఏడాది తర్వాత తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సామ్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
సమంత ఇటీవల బాంద్రాలో ఉన్న తన జిమ్‌కు బయలుదేరినప్పుడు మీడియా కంటికి చిక్కింది. అక్కడ ఆమె తన కారులో కూర్చుని.. ఫోన్లో కొంచెం టెన్షన్ టెన్షన్‌గా మాట్లాడుతూ కనిపించారు. ఆమె మొహంలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. అలా ఫోన్లో మాట్లాడుతూ సమంత టెన్షన్ పడడంతో.. అసలు ఏమైంది అని అభిమానులు.. ఆరా తీస్తున్నారు. కాగా గ్రే కలర్ యాక్టివ్‌వేర్ ధరించి, డార్క్ సన్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపించింది సమంత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Read More...
Chaitanya- Shobhitha: నాగచైతన్య కోసం అలాంటి త్యాగం చేసిన శోభిత..? షాక్‌లో ఫ్యాన్స్