- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూండాలను చితకొట్టిన సమంత..మళ్లీ భారీ యాక్షన్ ట్రీట్ రెడీ..??
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తన గ్లామర్‌తోనే కాకుండా నటనకు ఫుల్ మార్క్స్ అందుకుంది. ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్2'లో రాజీ పాత్రతో సమంత యాక్షన్ హీరోయిన్‌గా అందరికీ ఆకట్టుకుంది. ఆ పాత్రలో సమంత నటనను అందరూ ప్రశంసిస్తుండగానే 'ఊ అంటావా మావా' అంటూ గ్లామర్ ఫీస్ట్ అందించింది. అనంతరం తన తదుపరి సినిమా 'శాకుంతలం'లోనూ రాకుమారిగా కనిపించనుంది. అయితే ఇంతలో అమ్మడు మరోసారి హార్డ్‌కోర్ యాక్షన్ హీరోయిన్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట. సమంత నెక్స్ట్ మూవీ 'యశోధ'కు యాక్షన్ డైరెక్టర్ ఎన్నిక్ బెన్ కూడా పనిచేస్తున్నాడు. అయితే తాజాగా సమంతతో యాక్షన్ సన్నివేశాలను ఎన్నిక్ చిత్రీకరించాడని, వీటిలో కొందరు రౌడీలతో సమంత ఫైట్ చేస్తూ కనిపిస్తోందని నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే నెగిటివ్ పాత్రలో అదరగొట్టి సమంత ఇప్పుడు హీరో పాత్రలతో అంతకుమించి అనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.