పాపం సమంత అప్పుడు చాలా కష్టాలు పడింది.. సామ్ బాయ్ ఫ్రెండ్ సంచలన కామెంట్స్.. విడాకుల గురించేనా..?

by Kavitha |   ( Updated:2024-10-25 15:13:52.0  )
పాపం సమంత అప్పుడు చాలా కష్టాలు పడింది.. సామ్ బాయ్ ఫ్రెండ్ సంచలన కామెంట్స్.. విడాకుల గురించేనా..?
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత(Samantha).. ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(citadel: Honey Bunny)సిరీస్‌తో మనముందుకు రాబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man 2) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj & DK) రూపొందిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ భారీ అంచనాల నడుమ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుల్లో ఒకరైన రాజ్.. సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “సెట్లో సమంత చాలా కష్టాలు పడింది. సిటాడెల్ షూటింగ్ సమయంలోనే ఆమెకు మయోసైటిస్ ఉందని తెలిసింది. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. సెట్‌కు చాలా లేట్‌గా వచ్చేది. నీరసంగా ఉండేది. కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయేది. ఆమె అలా పడిపోయిందో లేక ఇంకేమైందో తెలియక మేము భయపడేవాళ్లం. ఎన్నోసార్లు అంతా సెట్ చేసుకుని ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. ఈ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడింది” అని రాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఈ సిరీస్‌తో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కాగా చైతో విడాకుల తర్వాత సామ్, రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి విదితమే. నిజం చెప్పాలంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ చేయడం వల్లనే చై, సామ్‌కు విడాకులు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్న విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత రాజ్‌తో సామ్ చాలాసార్లు కనిపించింది. ఇక ఇప్పుడు ‘సిటాడెల్’ షూటింగ్ సమయంలో సమంత పడిన కష్టాలను ఆయన ఏకరువు పెట్టడంతో వీరి ప్రేమాయణం రూమర్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Advertisement

Next Story