అణుబాంబుపై రష్యా కీలక ప్రకటన.. అది వాడితే వినాశనమే..!

by Satheesh |   ( Updated:2022-03-23 11:16:32.0  )
అణుబాంబుపై రష్యా కీలక ప్రకటన.. అది వాడితే వినాశనమే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపుగా నెల రోజుల నుండి ఉక్రెయిన్‌పై రష్యా బీకరదాడులు కొనసాగిస్తోంది. బాంబులు, మిస్సైళ్ల దాడులతో ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలను నేలమట్టం చేస్తోంది రష్యన్ ఆర్మీ. ఈ దాడుల్లో ఇప్పటికే చాలా మంది మరణించగా.. లక్షల మంది శరణార్థులుగా మారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఇరు దేశాల అధినేతలు ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఇప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. రష్యన్ ఆర్మీకి ధీటుగా ఉక్రెయిన్ సైన్యం బదులిస్తుండటంతో రష్యా అధ్యక్షడు పుతిన్ తీవ్ర కోపంలో ఉన్నాడని.. ఉక్రెయిన్‌పై అణుబాంబు ప్రయోగిస్తారని గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అణ్వాయుధాల వాడకంపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశాడు. 'మాకు ఒక జాతీయ భద్రత విధానం ఉంది.. మా దేశ అస్థిత్వానికి విఘాతం కలిగినప్పుడే.. ఆ పరిస్థితులకు అనుగుణంగా అణబాంబు ఉపయోగిస్తామని' ఈ సందర్భంగా వెల్లడించాడు. అగ్ర రాజ్యమైన అమెరికా పెస్కోవ్ వ్యాఖ్యలను తప్పుబట్టి.. అణ్వాయుధాలు కలిగి ఉన్న రష్యా బాధ్యతయుతంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, ప్రపంచం మొత్తంలో కెల్లా అత్యధిక అణుబాంబులు, ప్రమాదకర అణుబాంబులు రష్యా దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. రష్యా కనుక ఉక్రెయిన్‌పై అణుదాడి చేస్తే అది విశ్వ సంక్షోభంగా తలెత్తి.. మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed