భారత రాష్ట్రపతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు

by Nagaya |
భారత రాష్ట్రపతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు
X

దిశ, మాస్కో: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదిముర్ముకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ద్వారా రష్యాలోని భారత ఎంబసీ ఈ విషయాన్ని తెలియజేశారు. 'భారత్‌తో ప్రత్యేక విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలకు మేము చాలా ప్రాముఖ్యతనిస్తాము. దేశాధినేతగా మీ కార్యకలాపాలు మన స్నేహపూర్వక దేశాల ప్రయోజనాల కోసం, బలమైన అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం వివిధ రంగాలలో రష్యా-భారత రాజకీయ సంభాషణ కొనసాగుతుంది. దీంతో ఇరు పక్షాల మధ్య ఉత్పాదక సహకారాన్ని మరింత అభివృద్ధి పరుస్తాయని నేను ఆశిస్తున్నాను' అని ప్రకటనలో విడుదల చేశారు. ఒడిశాకు చెందిన ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గిన తొలి ఆదివాసీ మహిళగా రికార్డు సృష్టించారు. సోమవారం ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story