- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > రష్యా ఎప్పుడైనా ఉక్రెయిన్‌పై దాడి చేయొచ్చు: యూఎస్ సెక్రటరీ అంటోనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు
రష్యా ఎప్పుడైనా ఉక్రెయిన్‌పై దాడి చేయొచ్చు: యూఎస్ సెక్రటరీ అంటోనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు
by Disha Desk |
X
మెల్‌బోర్న్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధవాతవరణంపై యూఎస్ సెక్రటరీ అంటోనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఏ సమయంలోనైనా సరిహద్దు దేశం ఉక్రెయిన్‌పై దండెత్తె అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఈ దాడి వింటర్ ఒలింపిక్స్ సమయంలో కూడా జరగవచ్చని తెలిపారు. రష్యాతో చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికి యూఎస్ ఇష్టపడుతుందని బ్లింకెన్ నొక్కి చెప్పారు. దానికోసం సాధ్యమైన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో తగిన రక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఒకవేళ రష్యా తేడాగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అంతకుముందు బైడెన్ అమెరికా పౌరులను ఉక్రెయిన్ విడిచిరావాలని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Advertisement
Next Story