'మీకు దావత్ ఇవ్వను కానీ.. మీ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇస్తా'

by GSrikanth |
మీకు దావత్ ఇవ్వను కానీ.. మీ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇస్తా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాసాలమర్రి గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఓ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ పెట్టారు. ''మీరు పెట్టే బుక్కెడు బువ్వ, మీ అభిమానం చాలు. మీకు వాసాలమర్రి కోట్ల దావతు ఇవ్వను, మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఇస్తాను. మీ ఓటు నోటుకు అమ్మకుండా ఏనుగు గుర్తుకు వేయండి.'' అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Advertisement

Next Story