Rohit Sharma: ముంబై వరుస ఓటములకు కారణం అదే: రోహిత్ శర్మ

by Satheesh |   ( Updated:2022-04-25 11:30:13.0  )
Rohit Sharma: ముంబై వరుస ఓటములకు కారణం అదే: రోహిత్ శర్మ
X

Rohit Sharma

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమవుతోంది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా పేరున్న ముంబై.. ఇప్పటి వరకు 5 టైటిళ్లు గెలిచింది. తమదైన రోజు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లున్నప్పటికీ.. ముంబై వరుసగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్ వంటి స్టార్ ప్లేయర్స్ బ్యాటింగ్‌లో రాణించకపోవడం ముంబై వరుస ఓటములపై ప్రభావం చూపిస్తుంది.

తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఓటములకు గల కారణాలపై స్పందించాడు. 'లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడానికి కారణం మా జట్టు బ్యాటింగే. బౌలర్లు బాగానే రాణించినప్పటికీ.. బ్యాటర్లు విఫలమవడంతోనే ఓడిపోయాం. ఆ పిచ్‌పై 169 పరుగుల లక్ష్యాన్ని చేధించవచ్చు.. కానీ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పోగొట్టుకున్నాం. ఈ సీజన్‌లో ముంబై వరుస ఓటములకు కారణం.. నాతో సహా మిగిలిన బ్యాటర్లు సరిగ్గా రాణించకపోవడం.. సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోవడం' అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed