- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్లు, ప్లాట్లు వెనక్కి ఇవ్వండి: బీజేపీ సభ్యులకు రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ శాసనసభ్యులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రితం రోజు ఐఫోన్లు వెనక్కి ఇస్తామని తెలపడంతో.. గతంలో ఇచ్చినవి కూడా తిరిగి ఇవ్వాలని గురువారం ప్రభుత్వం కోరింది. బుధవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ 13ను అందజేసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని చెబుతూ బీజేపీ నేతలు ఫోన్లు వెనక్కి ఇచ్చారు. దీనిపై డిప్యూటీ చీఫ్ విప్ మహేంద్ర చౌదరీ స్పందించారు. ఇది తీవ్రమైన విషయమేమి కాదు. కానీ వారు ఫోన్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటే, గతంలో వారికిచ్చిన ప్లాట్లు, ఐపాడ్లు కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది' అని తెలిపారు. గతంలో ఇలాంటి బహుమతి తీసుకుని కూడా బీజేపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పూనియా ప్రశ్నించారు. మరోవైపు పలు పార్టీల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేశారు.