- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణకు విద్యుత్ కావలెను.. రికార్డు స్థాయికి పెరిగిన డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ శనివారం నమోదైంది. ఏకంగా 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇది దాదాపు 14 వేల మెగావాట్లకు చేరువలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇదే పీక్ విద్యుత్ డిమాండ్‌గా పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా రాబోయే రోజుల్లో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పీక్ విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్ల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని, అయినా విద్యుత్‌సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లుగా ఆయన తెలిపారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 55 మిలియన్ యూనిట్లు దాటలేదని, కానీ ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్నమోదు కాగా ఎస్పీడీసీఎల్పరిధిలో 8425 మెగావాట్ల డిమాండ్నమోదైంది. ఎన్పీడీసీఎల్పరిధిలో 4982 మెగావాట్ల డిమాండ్నమోదైంది