మంచిర్యాలలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు..

by Vinod kumar |
మంచిర్యాలలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు..
X

దిశ, మంచిర్యాల: ఓ మాతృమూర్తి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజుర్ మండలం లాఖడ్ కోట గ్రామానికి చెందిన మడేవ అశ్విని-సురేష్ దంపతులు.. అశ్విని గర్భం దాల్చడంతో ఆమె స్థానికంగానే వైద్యం పొందుతోంది. ఆమెకు నెలలు పూర్తి కావడంతో ప్రసవం చేసుకునేందుకు మంచిర్యాల ఆస్పత్రిలో చేరింది.


అశ్వినికి నొప్పులు రావడంతో డాక్టర్‌ ప్రతిభ అధ్వర్యంలో ఆమెకు వైద్య పరీక్షలు చేసి నార్మల్ డెలివరీ చికిత్స అందించగా, ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మించారు. ఆ మాతృమూర్తి మొదట మగ శిశువుకు జన్మనివ్వగా.. మళ్లీ రెండవ కాన్పులో మరో ముగ్గురూ మగ శిశువు లకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో జన్మించిన ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్‌ ప్రతిభ తెలిపారు.

Advertisement

Next Story