'గని ప్రమాదం దురదృష్టకరం.. అందరూ క్షేమంగా తిరిగి రావాలి'

by GSrikanth |
గని ప్రమాదం దురదృష్టకరం.. అందరూ క్షేమంగా తిరిగి రావాలి
X

దిశ, గోదావరిఖని, రామగిరి: అర్జీ-3 ఏరియా అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం గని పైకప్పు కూలి తీవ్ర గాయాలపాలైన కార్మికులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి బయలుదేరి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబాద్‌కు రెఫర్ చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులున్నారు. అడ్రియాల ఏరియా పరిధిలోని ఏఎల్‌పీ గనిలో సోమవారం జరిగిన గని ప్రమాదం దురదృష్టకరమని, గని ప్రమాదంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా తిరిగిరావాలని పుట్ట మధు ఆకాంక్షించారు. గని ప్రమాదం జరిగిన ఏఎల్‌పీ గనిని సందర్శించిన ఆయన ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... గని ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు అందులో చిక్కుకోగా ఎరుకల వీరయ్య అదే సమయంలో అక్కడ నుండి బయటపడ్డాడని, తాము గని వద్దకు చేరిన సమయంలో ఎఫ్ బీఎల్ ఆపరేటర్ వెంకటేష్‌ను రెస్క్యూ బృందం రక్షించి తీసుకురాగా, ఓర్మెన్ నరేష్‌ను పైకి తీసుకు వస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇంకా ఆ ప్రమాదంలో చిక్కుకున్న ఏరియా రక్షణాధికారి జయరాజ్, అండర్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవిందర్, వీటీసీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్‌లు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. ప్రమాద బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, నాయకులు దేవ శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి పర్శ బక్కయ్య, జక్కుల దామోదర్, కాపురబోయిన భాస్కర్, మేడగోని రాజన్న, బడికల శ్రీనివాస్, బుద్దె ఉదయ్, నాగెల్లి సాంబయ్య, ఇసంపల్లి రమేష్, బత్తుల రమేష్, టి.క్రిష్ణ, ఇల్లందుల సంజీవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story