- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎగ్జైట్‌మెంట్‌లో పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా : హీరో రామ్
దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం 'ది వారియర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ ప్రేక్షకులతో పలు విషయాలు పంచుకున్నారు. పోలీస్ కథతో సినిమా చేయాలనుకున్న టైమ్‌లో లింగుస్వామి 'ది వారియర్' కథ వినిపించారని, ఇందులోని సోల్, ఎమోషన్ బాగా నచ్చడంతో ఓకే చేశానని అన్నారు. ఈ కథ విన్న తర్వాత కలిగిన ఎగ్జైట్‌మెంట్‌తో సాయంత్రానికల్లా పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించుకున్నానని తెలిపాడు. షూటింగ్‌లో స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్ అయినపుడు సినిమాలా? జీవితమా? అనే ప్రశ్న ఎదురైందని, కానీ సినిమాలే లైఫ్ అనుకునే తనకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్‌లా అనిపించిందని చెప్పాడు రామ్.
ఇక ఈ సినిమాలో విలన్ రోల్‌కు ఆది పినిశెట్టి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడని పేర్కొన్నాడు. మ్యూజిక్ విషయానికొస్తే.. దేవి శ్రీ ది బెస్ట్ ఇచ్చాడంటూ ప్రశంసించాడు. నెక్ట్స్ బోయపాటి శ్రీనుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలిపిన రామ్.. ఆ తర్వాత ఎవరితోనో ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశాడు.